ఏపీలో జల్లికట్టు విషయంలో పోలీస్ అధికారుల తీరుతో ఏపీ మంత్రి అలిగారు. తన నియోజకవర్గంలో జల్లికట్టుకి అనుమతి ఇవ్వలేదని, అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో అనుమతులిచ్చారని అన్నారాయన. పక్కనే ఉన్న తమిళనాడులో జల్లికట్టు నిర్వహిస్తున్నా కూడా.. తన నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నారాయణ స్వామి.