రాష్ట్ర బీజేపీ నేతలు పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేశారా? ఏపీలో పవన్ ని ఒంటరిని చేసేందుకు పావులు కదుపుతున్నారా..? ముద్రగడను బీజేపీలో చేర్చుకునేందుకు పార్టీ పెద్దలు వేసిన స్కెచ్ దీనికి నిదర్శనమా..? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది. బీజేపీపై మత తత్వ పార్టీ అనే ముద్ర ఉంది కానీ, కులం ముద్ర ఇంకా పడలేదు. కానీ బీజేపీ ఏపీలో రాజకీయాలను కులం బేస్ మీద చేయాలనుకుంటోంది. రెండు ప్రధాన సామాజిక వర్గాలు ఏపీలో వైసీపీకి, టీడీపీకి మద్దతిస్తున్నాయి, మూడో వర్గాన్ని బీజేపీ మచ్చిక చేసుకుంటోంది. అందుకే వరుసగా పార్టీ అధ్యక్ష పదవుల్ని ఆ సామాజిక వర్గానికే కట్టబెడుతూ వస్తోంది.