తెలంగాణ సీఎం కేసీఆర్ బకాయి పడ్డ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, ఎంఎంటీఎస్ పనులు ఆగిపోయాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలంటే కేసీఆర్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎంఎంటీఎస్ విస్తరణ పనులపై ఆయన కేసీఆర్ ని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం విస్తరణ పనులకోసం హామీ ఇచ్చిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని, దీని వలన అదనపు భారం పడుతుందని వివరించారాయన.