కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారంలో బీజేపీకి ఏపీలో పెద్ద సీన్ లేదనే విషయం తెలిసిందే. విభజన హామీలు, ప్రత్యేకహోదా అమలు చేయని బీజేపీని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో ఒకశాతం ఓట్లు కూడా పడలేదు. అయినా సరే ఏపీలో ఎదగాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని తోక్కేసి, అధికార వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోంది.