దివంగత భూమా నాగిరెడ్డి వారసురాలుగా ఉన్న భూమా అఖిలప్రియ ఇప్పుడు చిక్కుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఓ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ జైలు జీవితం గడుపుతుంది. అయితే కిడ్నాప్ వ్యవహారం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఈ విషయంపై అసలు స్పందించడం లేదు. అటు నారా లోకేష్ కూడా ఈ విషయంపై మాట్లాడటం లేదు. దీంతో టీడీపీ, అఖిలప్రియని లైట్ తీసుకుందనే చర్చలు మొదలయ్యాయి.