తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈ గోదావరి జిల్లాలు అంటే మర్యాదలకు మారు పేరు అని తెలుగు రాష్ట్రాల్లో అందరూ చెప్తారు. ఇక సంక్రాంతి పండుగ అంటే చాలు ఆంధ్రప్రదేశ్లోని పల్లెలన్నీ కళకళలాడుతాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలైతే కోడి పందేలు, పండగ శోభతో మరింత వెలిగిపోతుంటాయి.