వేల కోట్ల రూపాయల విలువైన భూ వ్యవహారంలో.. 10లక్షల రూపాయలకోసం చేసిన కిడ్నాప్ కీలకంగా మారింది. ఈ కిడ్నాప్ కోసం విజయవాడ గ్యాంగ్ రంగంలోకి దిగిందని, వారి ద్వారానే పని పూర్తి చేశారని పోలీసులు తెలియజేశారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మరో 15మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. అసలు వ్యవహారాన్ని వివరించారు. ఈ కేసులో సూత్రధారి, ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిలప్రియేనని పోలీసులు తేల్చారు.