రాష్ట్రంలో ఆలయాల ఘటనలతో కొన్నిరోజులుగా వాతావరణం వేడెక్కింది. రామతీర్ధం వ్యవహారం మరచిపోకముందే.. పదే పదే అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సీసీ కెమెరాల సాయంతో పోలీసులు వెనువెంటనే వాటిని ఛేదిస్తున్నారు. తాజాగా.. విగ్రహాల చోరీ వ్యవహారాన్ని కూడా ఇలాగే బైటపెట్టారు. కేవలం గంట వ్యవధిలోనే ఈ కేసుని ఛేదించి శెహభాష్ అనిపించుకున్నారు గుంటూరు పోలీసులు.