ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి ఇంటికి 4 ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో బల్బు రూ.10 చొప్పున అత్యధిక సామర్థ్యం గల నాలుగు ఎల్ఈడీ బల్బులను విద్యుత్ శాఖ ప్రతి ఇంటికి అందించనుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఇంధన పొదుపు సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్ లిమిటెడ్ 'గ్రామ ఉజాలా' పథకాన్ని అందుబాటులోకి తెస్తోందన్నారు..