ఏపీ రాజకీయాల్లో సంచయిత ఓ సంచలనం అనే చెప్పాలి. టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్న ఆనంద గజపతి రాజు కుమార్తెగా ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టిన సంచయిత కొంతకాలం బీజేపీతో నడిచిన విషయం తెలిసిందే. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక అశోక్ గజపతిరాజుకు చెక్ పెడుతూ, పూసపాటి వంశం ఆధ్వర్యంలో నడుస్తున్న మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయంతో పాటు, పలు ఆలయాల ఛైర్మన్గా సంచయితని నియమించారు.