కడప జిల్లా పులివెందుల...అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఆ ఫ్యామిలీ తప్పా, మరో నాయకుడు గెలవలేదు. వైఎస్సార్, వైఎస్ వివేకా, వైఎస్ విజయమ్మ...ఇప్పుడు వైఎస్ జగన్ పులివెందుల గడ్డని ఏలుతున్నారు. అయితే ఇక్కడ వైఎస్ ఫ్యామిలీకి టీడీపీ పోటీ ఇవ్వలేక ప్రతిసారి చతికలపడుతుంది. కాకపోతే మొన్నటివరకు పులివెందులలో టీడీపీ చెప్పుకోవడానికి ఓ నాయకుడు ఉండేవారు. టీడీపీ నుంచి సతీశ్ రెడ్డి పోటీ చేసి వైఎస్ ఫ్యామిలీపై ఓడిపోతూ ఉండేవారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా సతీశ్, జగన్పై దాదాపు 90 వేల మెజారిటీతో ఓడిపోయారు.