ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 15మంది ఒకే రకమైన అనారోగ్య లక్షణాలతో ఆస్పత్రికి వచ్చారు. కళ్లు తిరుగుతున్నాయని, మైకం కమ్ముతోందని ఉన్నట్టుండి పడిపోయిన వీరందరినీ బంధువులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. వీరిలో ఐదుగురికి ఫిట్స్ లక్షణాలు ఉన్నాయి. రెండు రోజుల వ్యవధిలో 15మంది ఒకే రకమైన లక్షణాలతో మూర్ఛ వచ్చినట్టు పడిపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామంలో కలకలం రేగింది.