నేటి సమాజంలో వాట్సప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరు వాట్సప్ ని వాడుతూనే ఉన్నారు. ఇక ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్త నిబంధనలకు ఒప్పుకోకుంటే వాళ్ల వాట్సాప్ అకౌంట్ తొలగిస్తామని ప్రకటించింది. దీంతో ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది.