ఏపీలో రాజకీయాలు మరీ రోత పుట్టిస్తున్నాయి. 151 ఎమ్మెల్యేల బలం ఉన్న వైసీపీ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోయడం విస్తుగొలుపుతోంది. అప్పటికీ జనసే నుంచి ఒకరిని, టీడీపీ నుంచి నలుగురిని తమవైపుతిప్పుకున్నా కూడా ఇంకా ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం మానలేదు వైసీపీ. అటు టీడీపీ కూడా తగుదునమ్మా అంటూ ఇలాంటి తిట్ల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టే కనిపిస్తోంది. మాటకు మాట పెంచుకుంటూ పోతోంది.