కేసీఆర్ సర్కారు మాట తప్పింది. పేదలకు ఉచితంగా తాగునీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం చిన్న మెలిక పెట్టింది. ఈ నిబంధనను సవరించే వీలున్నా కూడా పేదలపై భారం మోపేందుకే సిద్ధపడింది. దీంతో గ్రేటర్ పరిధిలోని పేదలంతా వాటర్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. డిసెంబరు 15వ తేదీ నుంచే ఉచిత తాగునీటి పథకం అమల్లోకి వచ్చినా.. మీటర్లు బిగించుకున్న తర్వాతే దాని ప్రతిఫలం ప్రజలకు అందుతుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. దీంతో.. ప్రతి ఒక్కరూ మీటరు బిగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.