కొడుకు అంటే పున్నామ నరకం నుండి కాపాడేవాడని అందరు అంటారు. అయితే అలాంటి కొడుకునే చంపేశాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన కర్నాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన బివి కేశవ ఒక వ్యాపారవేత్త. ఈ నెల 10 నుంచి తన పెద్ద కుమారుడు కౌశల్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.