రైతు సంఘాలు పంతం నెగ్గించుకున్నాయి. ఎట్టకేలకు కేంద్రంతోటే.. తమ చట్టాలను వాయిదా వేసుకుంటున్నామంటూ చెప్పించుకున్నాయి. అయితే ఇక్కడితో వారు సంతృప్తి చెందుతారా? లేక చట్టాల రద్దుకోసం ఉద్యమిస్తారా అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద పదో విడత జరిగిన చర్చలు మాత్రం సఫలం అయినట్టే కనిపిస్తున్నాయి. ఇక చివరిసారిగా ఈనెల 22న జరిగే 11వ విడతల చర్చలతో.. ఢిల్లీ సరిహద్దులనుంచి రైతు శిబిరాలు ఎప్పుడు ఖాళీ చేస్తారనే విషయం స్పష్టమవుతుంది.