మనకు అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్ ని చిన్న పిల్లలకు ఇవ్వరు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న కొవాక్సిన్, కొవిషీల్డ్ టీకాల ప్రయోగాలు ఇంకా చిన్నారులపై జరగలేదు కాబట్టి.. వారికి వ్యాక్సినేషన్ ఇవ్వలేమని చెబుతున్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. అయితే చిన్నారులకు ఇచ్చే వ్యాక్సిన్లలో నాజల్ వ్యాక్సిన్ ఉత్తమం అని అంటున్నారాయన. ప్రస్తుతం నాజల్ వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.