ఇంటి వద్దకే రేషన్ అంటూ కొత్త పథకాన్ని తీసుకొచ్చిన జగన్ సర్కారు.. అదే సమయంలో రేషన్ డీలర్ల కడుపు కొడుతోంది. కరోనా కష్టకాలంలో కూడా నెలకి రెండు సార్లు రేషన్ సరకులు ఇచ్చిన డీలర్లకు ఇంత వరకు వాటికి సంబంధించిన కమీషన్ డబ్బులు విడుదల కాలేదు. ఇప్పుడు కొత్తగా రేషన్ సరకులు ఇంటింటికీ పంపిస్తామంటూ చెబుతున్నారు. దీంట్లో రేషన్ డీలర్ల పాత్ర పూర్తిగా తగ్గించేశారు. పొమ్మనలేక ఇలా తమకు పొగపెడుతున్నారంటూ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.