కరోనా కష్టకాలంలో పరీక్షలు లేకుండా ఆల్ పాస్ అంటూ అందరికీ ఊరటనిచ్చాయి ప్రభుత్వాలు. ఆ ఆఫర్ తో ఎన్నో ఏళ్లుగా ఫెయిలవుతూ వచ్చినవారంతా కరోనా దెబ్బకి పాసైపోయారు, పండగ చేసుకున్నారు. ఇక ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గినా కూడా విద్యార్థులకు వచ్చిన ఆఫర్ మాత్రం వెనక్కి పోలేదు. తాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిలైన 1.92లక్షల మంది విద్యార్థులను సప్లిమెంటరీ లేకుండానే పాస్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.