నాయకులు ఎందరో వస్తుంటారు.. మరెందరో తెరమరుగవుతారు. కానీ, ప్రజల పక్షాన నిలిచే నాయకులు చాలా చాలా తక్కువ మందే ఉంటారు. ముఖ్యంగా పేదల మనసు తెలిసిన నాయకులు మరింత తక్కువగా ఉంటారు. ఇలా.. పేదల మనసు తెలిసిన, గెలిచిన నాయకుడు ఎవరైనా ఉంటే.. ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రస్తుత నేతల్లో ఆమంచి కృష్ణమోహన్ కనిపిస్తున్నారని అంటున్నారు ఇక్కడి పేదలు. ``మా కోసం ఎన్నో మంచి పనులు చేశారు. మేం మత్స్యకారులం. మాకోసం షెడ్లు కట్టించారు. మా పిల్లలకు ఏటా పుస్తకాలు కొనిచ్చేవారు.!`` అని ఇప్పటికీ స్మరించుకునే మత్స్యకార కుటుంబాలు అనేకం.