రోడ్డు ప్రమాదంలో చాల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేటలో ఆటో కంటైనర్ ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతి చెందిన వారు చింతబావికి చెందిన రోజువారీ కూలీలుగా గుర్తించారు.