తిరుపతి ఉప ఎన్నికలకోసం సమాయత్తం అవుతూ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు జనసేన నాయకులు. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అయితే ఈ మీటింగ్ లో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని తీర్మానం చేశారు. అదే సందర్భంలో ఒకవేళ తిరుపతి సీటుని బీజేపీకి త్యాగం చేయాల్సి వస్తే.. రాబోయే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పేరు అధికారికంగా ప్రకటించాలనే డిమాండ్ చేశారు జనసేన నేతలు.