తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహార శైలిలో పూర్తిగా మార్పు వచ్చేసింది. గతంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోబోతున్నట్టు వ్యవహరించిన ఆయన ఇప్పుడు పూర్తిగా సంయమనం పాటిస్తున్నట్టు అర్థమవుతోంది. వ్యవసాయ చట్టాలను గట్టిగా వ్యతిరేకించిన కేసీఆరే, తర్వాతి రోజుల్లో పంట కొనుగోళ్లపై ఆంక్షలు ఎత్తేసి, కేంద్రానికి వత్తాసు పలికారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కూడా కేంద్రానికి తలొంచారు.