చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని, చనిపోయిన కోళ్లు, కాకులు ఇతర పక్షుల ద్వారా ఆ వ్యాధి వ్యాపిస్తుందని అనుకుంటున్నారంతా. అయితే అంతకంటే పెద్ద ముప్పు పావురాల ద్వారా పొంచి ఉందని అంటున్నారు నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో పావురాలతో స్నేహం చేసేవారికి వార్నింగ్ ఇస్తున్నారు. పావురాలు పెంచుకుంటున్నా, లేదా వివిధ ప్రాంతాల్లో పావురాలకు మేత వేసే అలవాటున్నా వెంటనే దాన్ని మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.