మామూలుగా విస్కీ లు కాసింత తాగినా కిక్కులో ముంచేస్తాయి. మందు బాబులు ఎక్కువగా విస్కీ కి మొగ్గు చూపుతారు. ఇకపోతే ఇండియన్ బ్రాండ్ విస్కీ మిథున ప్రపంచాన్ని ఊపేస్తోంది. మత్తులో మంచెత్తెత్తోంది. అది ఇచ్చే కిక్కుకు అందరూ మందు బాబులు ఫిదా అవుతున్నారు. అందుకే అంతర్జాతీయంగా మిథున పేరు మార్మోగిపోతోంది. ప్రపంచంలో "మూడవ ఉత్తమమైన విస్కీగా ఇది అప్పుడు రికార్డు సృష్టించింది. ఈ రికార్డు వల్ల ఈ బ్రాండు వ్యాల్యు మరింత పెరిగింది. ఈ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న మొట్టమొదటి ఇండియన్ విస్కీ లిక్కర్ బ్రాండ్ కూడా మిథునే.