అమరావతి రాజధాని ఉద్యమం ప్రభావం కావొచ్చు...టీడీపీ బలంగా ఉండటం కావొచ్చు...గుంటూరు పార్లమెంట్ పరిధిలో గల్లా జయదేవ్‌కు వైసీపీ చెక్ పెట్టడం కష్టమే అనిపిస్తోంది. అసలు గుంటూరులో టీడీపీకి పెద్ద గెలిచిన రికార్డు లేదు. 1991, 1999 ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. ఇక మెజారిటీ సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత పరిస్తితి మారింది. టీడీపీ, వైసీపీల హవా మొదలైంది.