సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నేరేడుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తాళికట్టిన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. అందుకు తండ్రి, తమ్ముడి సహాయంతో హత్య చేసి ఎడ్ల బండిలో వేసుకుని వెళ్లి మరీ గ్రామ శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలో పాతిపెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.