అకస్మాత్తుగా ఫలానా స్కూల్ గుర్తింపురద్దు చేశాం, ఫలానా కాలేజీ గుర్తింపు రద్దయింది అని ప్రకటన వస్తే తల్లిదండ్రుల ఆందోళన అంతా ఇంతా కాదు. తమ పిల్లలు చదివే స్కూళ్లకు ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలో దిక్కుతోచని స్థితికి వెళ్లిపోతారు పేరెంట్స్. ఏపీలో కూడా కొంతమంది పేరెంట్స్ కి అలాంటి పరిస్ధిితి ఎదురయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 25 స్కూల్స్, 50 జూనియర్ కాలేజీలపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సులు అందాయి. వీటి భవితవ్యంపై జగన్ సర్కారు నిర్ణయం తీసుకోబోతోంది.