ఆదిలాబాద్ పట్టణంలో ఓ వ్యభిచార ముఠా గుట్టు చప్పుడు కాకుండా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేసి 11మందిని అరెస్ట్ చేశారు. గురువారం టాస్క్‌ఫోర్స్ సీఐ ఇ.చంద్రమౌళి ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ రామకృష్ణతో కలిసి పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడిలో నలుగులు యువతులను ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు.