బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. లాలూ ప్రసాద్ చాలా కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు దాదాపుగా 75శాతం చెడిపోయాయి. దీనికితోడు, షుగర్, బీపీ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. 72ఏళ్ల వయసున్న లాలూకి వయోభారంతోపాటు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.