ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. వచ్చే నెల 5 నుంచి పంచాయితీ పోరు జరగనుంది. అయితే ఈ పంచాయితీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగవు. కానీ పార్టీలతో సంబంధం ఉండే జరుగుతాయి. ఇక ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు వైసీపీనే గెలుస్తుందని తెలుస్తోంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది.