కాపు రిజర్వేషన్...దశాబ్దాల కాలం నుంచి నలుగుతున్న అంశం. ఏపీలో మెజారిటీ ఉన్న కాపులు...తమని బీసీల్లో చేర్చాలని ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నారు. ఇక కాపు ఉద్యమం ప్రభావంతో 2014 ఎన్నికల ముందు చంద్రబాబు, రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసి, దాన్ని కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. ఇక ఇది కేంద్రం పరిధిలో ఉందని చెప్పి తప్పించుకున్నారు.