ప్రేమ రెండు మనస్సులను ఒకటి చేసింది.ఇక ఇద్దరు పెళ్లి చేసుకోవాలనీ, మంచి కుటుంబాన్ని కలిగి ఉండాలని ఎన్నో కలలు కన్నారు. ఇక డబ్బు సంపాదిస్తే ప్రేయసిని ఇచ్చి తనకు పెళ్లి చేయడానికి వారి తల్లిదండ్రులు అంగీకరిస్తారన్న నిర్ణయానికి ఆ ప్రియుడు వచ్చాడు. దీంతో యువకుడు డబ్బు సంపాదించడం కోసం దుబ్బాయి వెళ్ళాడు. కానీ అంతలోనే ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.