చాల మంది ఉప్పును ఎక్కవగా తింటుంటారు. అయితే ఎక్కువగా తినేవారికి బాడీలో ఉప్పు ఎక్కువవుతుంది. సాల్ట్ ఏమాత్రం ఎక్కువైనా మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుందని ఎపిడెమియోలజీ జర్నల్ లోని ఓ అధ్యయనం చెబుతోంది. ఉప్పు అంటే సోడియం. ఇది బాడీకి సరిపడా మాత్రమే అందాలి. ఎక్కువగా అందిస్తే ప్రమాదం. చాలా మందికి తాము సరిపడా ఉప్పును వాడుతున్నదీ లేనిదీ తెలియదు. ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తే... ఉప్పు తగ్గించాలనో, లేక మరికాస్త పెంచాలనో చెబుతుంటారు. అందుకే ఉప్పు సరిపడా తీసుకుంటున్నదీ లేనిదీ తేల్చుకునేందు