మొబైల్ ఫోన్ వ్యసనంగా మారడమే కాదు నిండు ప్రాణాలను బలి తీసుకునేంతలా బానిసలైపోతున్నారు. తాజాగా హైదరాబాద్ మహా నగరంలో ఓ బాలిక సెల్ ఫోన్ కోసం ఫ్రెండ్ తో గొడవపడి బలవన్మరణానికి పాల్పడింది. సెల్ ఫోన్ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.