గోవాకు చెందిన ఓ వ్యక్తి బాడీగార్డులతో కలిసివచ్చి వీఐపీలా ఫోజిచ్చి హోటల్ బిల్లు ఎగవేసి ఉడాయించాడు. స్వప్నిల్ నాయక్‌గా గుర్తించిన నిందితుడు తాను బసచేసిన హోటల్‌కు చెల్లించాల్సిన రూ 1.4 లక్షల బిల్లు చెల్లించకుండా పరారయ్యాడు. నాయక్ తన బాడీగార్డులను కూడా మోసగించినట్టు వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాయక్ ఈనెల 2న గాంధీనగర్‌లోని జియోన్ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు.జనవరి 8న నాయక్ భార్య సైతం హోటల్‌కు రాగా బాడీగార్డుల కోసం మరో రెండు రూములు తీసుకున్నారు. మరుసటి రోజు వారు ఓ మినీబస్‌ను మాట్లాడుకుని రామనగర టూర్‌కు వెళ్లారు.ఆపై హోటల్ బిల్లు చెల్లించకుండా భార్యాభర్తలు పరారయ్యారు.