ఏపీలో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి మంచి క్రేజ్ తెచ్చుకున్న నాయకులు చాలామందే ఉన్నారు. తమదైన శైలిలో పనిచేస్తూ, ప్రజలకు చేరువయ్యి, రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఎమ్మెల్యే విడదల రజిని ఒకరు. ఎన్ఆర్ఐగా వచ్చిన రజిని మొదట టీడీపీలో చేరారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతో పార్టీలో బాగానే యాక్టివ్‌గా పనిచేశారు. అలాగే టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుకు సపోర్ట్‌గా నిలబడ్డారు.