సాధారణంగా రాయలసీమలో టీడీపీకి పెద్ద బలం ఉండదు. గతంలో సీమలో కాంగ్రెస్ హవా ఉండగా, ఇప్పుడు వైసీపీ ఆధిక్యం ఉంది. కానీ టీడీపీకి మాత్రం బలం చాలా తక్కువ కడప, కర్నూలు జిల్లాల్లో టీడీపీకి ఎక్కువ స్కోప్ లేదు. అలాగే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సైతం మరీ ఎక్కువ బలం ఏమి లేదు. కానీ అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. మొదటి నుంచి జిల్లా టీడీపీకి అనుకూలంగా ఉంది. 2014 ఎన్నికల్లో సైతం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే, 12 టీడీపీనే గెలుచుకుంది. అటు 2 ఎంపీ సీట్లు సైతం టీడీపీనే గెలిచింది.