ఇంటి నుంచి చెత్తను తీసుకురండి.. ఉచిత భోజనం పొందండి..ఢిల్లీలోని నజాఫ్గఢ్ జోన్లోని వర్ధమాన్ ప్లస్ సిటీ మాల్ ప్రాంతంలో స్థానిక డైమండ్ స్వీట్స్ యాజమాన్యం ఒక కొత్త కెఫెను ప్రారంభించింది. ఈ కెఫె ప్రత్యేకతలు ఏంటంటే.. ఎవరైనా ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువచ్చి వాటికి బదులుగా రుచికరమైన ఆహారం పొందవచ్చు. ఈ కెఫెలో అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనంతోపాటు మిఠాయిలు కూడా దొరుకుతాయి..