తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను సీఎం చేయడానికి దోష నివారణ కోసమే సీఎం కేసీఆర్ కాళేశ్వరం వెళ్లారని ఆయన తెలిపారు. ఏదైనా చేస్తే కేసీఆర్ దాచిపెడతాడు. వాస్తవాలు ఎప్పుడు చెప్పడు..ప్రజలకు వాస్తవాలను చెప్పాలని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ నటనను ప్రజలు గుర్తించారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాటకాలను తెలంగాణ ప్రజలు నమ్మరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.