ఎట్టకేలకు పంచాయితీ ఎన్నికలకు సుప్రీం కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని చెప్పి, ఎన్నికలకు సుప్రీం పచ్చ జెండా ఊపింది. ఇలా సుప్రీం నుంచి తీర్పు వచ్చిన వెంటనే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం పంచాయితీ ఎన్నికలని రీ షెడ్యూల్ చేశారు. మొదటి దశలో జరిగే ఎన్నికలని చివరి దశలో పెట్టారు. అంటే ఫిబ్రవరి 9,13, 17, 21 తేదీల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి.