కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నానికి తిరుగులేదనే సంగతి తెలిసిందే. ఇక్కడ పార్టీల వారీగా ఉండే కేడర్‌తో పాటు, కొడాలికి ప్రత్యేకమైన కేడర్ ఉంటుంది. అందుకే నాని వరుసగా నాలుగుసార్లు గుడివాడ నుంచి విజయం సాధించారు. రెండు సార్లు టీడీపీ, రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచి, ఇప్పుడు జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. అలాగే కృష్ణా జిల్లా వైసీపీలో తిరుగులేని లీడర్‌గా ఉన్నారు.