జగన్ మూడు రాజధానులని ప్రకటించడం, అందులో విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడానికి సిద్ధంగా ఉండటంతో, విశాఖ జిల్లాలో ఎక్కువగా అధికార వైసీపీ డామినేషన్ కనిపిస్తోంది. జగన్ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. జిల్లాలో పలువురు టీడీపీ నేతలు పార్టీ మారిపోతే, మరికొందరు సైలెంట్ అయిపోయారు. కానీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మాత్రం, నిత్యం వైసీపీ మీద పోరాడుతూనే ఉన్నారు.