పరిటాల ఫ్యామిలీ... అనంతపురం జిల్లాలో రాజకీయంగా ఎక్కువ క్రేజ్ ఉన్న కుటుంబం. పరిటాల రవీంద్ర టీడీపీలో ఓ పవర్ సెంటర్‌గా ఉండేవారు. అయితే రవి చనిపోయాక ఆయన భార్య సునీత టీడీపీలో కీలకంగా పనిచేశారు. మూడుసార్లు రాప్తాడు నుంచి గెలిచారు. అలాగే 2014-2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక 2019 ఎన్నిలకొచ్చేసరికి సునీత పోటీ నుంచి తప్పుకుని, తన తనయుడు పరిటాల శ్రీరామ్‌ని రాప్తాడు బరిలో నిలిపారు.