అతడు ఒక్క రైతు. డబ్బులు బాగా సంపాదించాడు. అయితే అతనికి ఇది ఏం పాడుబుద్ధో తెలియదు కానీ మహిళల బలహీనతను ఆసరాగా చేసుకొని డబ్బును ఆశగా చూపి ఇప్పటికే ఆరుగురిని పెళ్లి చేసుకున్నాడు. సకల రోగాలతో సతమవుతూనే 63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ ధనిక రైతు. తన కంటే వయసులో ఇరవై ఏళ్లు చిన్నదైన ఆరో భార్య అతనితో శారీరక సంబంధానికి నిరాకరిస్తుందన్న కారణంగా అతను మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.