చాల మంది గోరు చిక్కుడుని తినడానికి ఇష్టపడరు. అయితే గోరు చిక్కుడుని ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు లభిస్తాయి. ఆరోగ్యానికి ఇది చాల మంచిది. గోరు చిక్కుడు లో అధికంగా ఫైబర్ ఉంటుంది. దీని మూలంగా రక్తం లోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.