ఎట్టకేలకు పంచాయితీ ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నది సాధించారు. మొదట నుంచి నిమ్మగడ్డకు జగన్ ప్రభుత్వం అడ్డుపడుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి నిమ్మగడ్డ-జగన్ ప్రభుత్వంల మధ్య ఎలాంటి వార్ జరిగిందో అందరికి తెలిసిందే. నిమ్మగడ్డకు జగన్ ఎన్ని రకాలుగా చెక్ పెడదామని చూసిన సాధ్యం కాలేదు. నిమ్మగడ్డ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని, చంద్రబాబు మనిషి అని వైసీపీ నేతలు నానా రకాలుగా విమర్శలు చేస్తూ వచ్చారు.