ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, రాష్ట్రంలో ఆ పార్టీ హావానే ఎక్కువగా ఉంది. పైగా ఎక్కువ మంది శాసనసభ్యులు వైసీపీ వాళ్ళే. దీని బట్టి చూస్తే ఇప్పుడు జరగబోయే పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ డామినేషన్ స్పష్టంగా ఉంటుంది. అలా అని టీడీపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ పార్టీ కూడా గట్టిగానే పోటీ ఇస్తుంది. అలాగే తమ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో టీడీపీ సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.