స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ ఓటమిని కోరుకుంటున్నారా..? తమని ఇన్నాళ్లూ పట్టించుకోని సీఎం కి ఈ ఎన్నికలతో జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నారా..? అందుకే ఎన్నికల ప్రక్రియను లైట్ తీసుకుంటున్నారా.? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం జగన్ అధికారం చేపట్టినప్పటినుంచి ఇప్పడి వరకు ఎమ్మెల్యేలను పెద్దగాపట్టించుకోలేదనే అపవాదు ఉంది. కనీసం మంత్రులకి కూడా పర్సనల్ గా అపాయింట్ మెంట్ ఇచ్చిన దాఖలాలు కాడా లేవట. అన్నీ ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష కార్యచరణలేనని విమర్శలున్నాయి. ఈ సందర్భంలో వస్తున్న స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలితే కచ్చితంగా జగన్ కి జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నారు ఎమ్మెల్యేలు.